

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు ఆదేశాల మేరకు పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకుటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్లును ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, నాయకులు గుర్రపు శ్రీనివాస్,బ్రహ్మం, చాంద్ పాషా,సాయిలు,మహిపాల్ రెడ్డి,తదితరులు ఉన్నారు

