

మనన్యూస్,నెల్లూరు:విజయమహల్ గేట్ సెంటర్ 45 వ డివిజన్ లోని కృష్ణ సాయి కళ్యాణ మండపం లో ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తూర్పు రాయసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పిల్లలు సాంస్కృతిక నృత్యాలు చేసి,ఆటపాటలతో ఆలోచించారు.అనంతరం ఆయా రంగాల్లో రానిస్తున్న మహిళలకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,ఏపీ వైఎస్ఆర్టిఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జాలి రెడ్డి అపుస్మా రాష్ట్ర నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షులు శివ శంకర్ రెడ్డి మోమెంటోలు అందజేసి సత్కరించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రానిస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారని అన్నారు.అమ్మగా,అక్కగా,చెల్లిగా,భార్యగా.మహిళ పోషిస్తున్న పాత్రలు.సమాజంలో ఆమెని ఉన్నత స్థాయిలో నిలుపుతున్నాయాన్నారు.
స్త్రీకున్న సహనం పురుషుడికి కూడా లేదని తెలిపారు.మహిళ అంటే ముందుగా గుర్తొచ్చేది.బాధ్యతని.మహిళ ఒక బాధ్యతను భుజాన వేసుకుందంటే ఆ బాధ్యతను మధ్యలో విడిచి వెళ్లకుండా.చివర వరకు ఆ బాధ్యతకు కట్టుబడి ఆమె సేవలందిస్తుందని తెలిపారు.
డాక్టర్ గా,నర్సుగా,ఉపాధ్యాయురాలిగా.ఇలా ఎన్నో రంగాల్లో మహిళ అందిస్తున్న సేవలు నిరూపమాణమన్నారు.సమాజంలో స్త్రీని ప్రతి ఒక్కరు గౌరవించి.వారి ఔన్నత్యాన్ని కాపాడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో AP YSRTA రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జాలిరెడ్డి అపస్మా రాష్ట్ర నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి వైఎస్ఆర్టిఏ రాష్ట్ర నాయకులు సుబ్బారెడ్డి,వాసు,రఘురామి రెడ్డి మునీర్ జాన్,జిల్లా అధ్యక్షులు శివ శంకర్ రెడ్డి,మహిళ అధ్యక్షులు శ్రీ లత ఇతర వైఎస్ఆర్టిఏ నేతలు,అనేక రంగాల్లో సేవలందిస్తున్న మహిళలు పాల్గొన్నారు.
