

మనన్యూస్,కామారెడ్డి:పట్టణ పోలీస్ స్టేషన్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా కి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది.వివరాలు.మహారాష్ట్ర,నాందేడ్ జిల్లా, నర్సి పట్టణానికి చెందిన షేక్ ఇమ్రాన్ ఇస్మాయిల్ మరియు షేక్ వాజిద్ అనే ఇద్దరు వ్యక్తులు గత రెండున్నర మూడు సంవత్సరాల నుండి కామారెడ్డి పట్టణంలో మరియు దేవనపల్లి ఏరియాలలో వివిధ ఇండ్లలో దొంగతనాలు చేస్తూ, దొంగతనం చేసిన సొత్తుని దెగ్లూర్ ఏరియా లో వ్యక్తులకు అమ్మినారని, దాదాపుగా 30-40 ఇండ్లలో తాళం పగలగొట్టి దొంగతనాలు చేసినట్టుగా ఒప్పుకున్నారు.. ఈ రోజు ఉదయం కామారెడ్డి కి దొంగతనం చేయు నిమిత్తమై వచ్చిన వీరిని, రైల్వే స్టేషన్ ఏరియా లో పట్టుకోవడం జరిగింది.. దొంగతనం చేసిన ఆభరణముల రికవరీ, మిగతా వారిపై తదుపరి విచారణ అనంతరం చర్యలు తీసుకొనబడును..
ఈ దొంగలని పట్టుకోవడం లో కామారెడ్డి సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ ఉస్మాన్, సిబ్బంది సురేందర్, రవి, గణపతి, శ్రవణ్, రాజేందర్, కిషన్ లు, పట్టణ సీఐ, రూరల్ సీఐ, రూరల్ ఎస్ఐ లు, సిబ్బంది కష్టపడి, ఆధారాలతో సహా పట్టుకోవడం జరిగింది..వీరిని జిల్లా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు అభినందించడం జరిగింది..
