మనన్యూస్,తిరుప‌తి:త‌న తండ్రి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాకే ప్రజాప్ర‌తినిధిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్నికైయ్యార్న వాస్త‌వాన్ని మ‌రిచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై విమ‌ర్శించ‌డం త‌గ‌ద‌ని జ‌న‌సేన న‌గ‌ర అధ్య‌క్షులు రాజా రెడ్డి అన్నారు.గురువారం ఉద‌యం రాజా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తిప‌క్ష హోదా కావాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌దే ప‌దే అడుక్కోవ‌డం ఆయ‌న ప‌ద‌వీ కాంక్ష‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు.తొలిసారి ఎమ్మెల్యే అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిబంధ‌న‌లు గుర్తు చేస్తే ప‌ర‌దాల రెడ్డి ఫ్ర‌స్టేష‌న్ లో నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార్పోరేట‌ర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు త‌క్కువ‌న్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వార్డు మెంబ‌ర్ కు ఎక్కువ స‌ర్పంచ్ కు త‌క్కువ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.చెట్టు పేరు చెప్పి కాయ‌ల‌మ్ముకున్న‌ట్లు వైఎస్సార్ పేరు చెప్పుకుని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎంపి, ఎమ్మెల్యే, సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంది నిజం కాదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.ప‌వ‌న్ క‌ళ్యాణ్ విళాస‌వంత‌మైన జీవితాన్ని వ‌దిలి రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం ప‌దేళ్ళు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలిచిన నాయ‌కుడని ఆయ‌న చెప్పారు.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేరు చెబితే 11 సిబిఐ కేసులు,కోడిక‌త్తి,గొడ్డ‌లి పోటు గుర్తు వ‌స్తాయ‌ని ఆయ‌న తెలిపారు.రాష్ట్ర అభివృద్ధికి క‌ట్టుబ‌డి ప‌ని చేస్తున్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని ఆయ‌న చెప్పారు.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే గెలుస్తాడ‌న్న గ్యారంటీ లేద‌ని ఆయ‌న తెలిపారు.ఇక‌నైనా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై అవాకులు చెవాకులు పేల‌డం ఆప‌క‌పోతే త‌గిన మూల్యం జ‌న‌సైనికులు ఇస్తార‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.ఈ స‌మావేశంలో జ‌న‌సేన నాయ‌కులు బాబ్జీ,రాజేష్ ఆచ్చారి,కీర్త‌న‌,మున‌స్వామి,ఆముదాల వెంక‌టేష్, ర‌మేష్ నాయుడు,ప‌వ‌న్,హేమంత్,జాన‌కిరామి రెడ్డి,ఉద‌య్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *