

అభినందించిన సిఐ బిఎస్ అప్పారావు,ఎస్సై ఎస్ లక్ష్మి కాంతం
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రత్తిపాడు
క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్ కార్పొరేట్ సోషియల్ రెస్పాన్స్ లో భాగంగా రద్దీ ప్రాంతాల్లో రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు 10 ఐరన్ బారికేడ్లు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ యస్.లక్ష్మి కాంతం సమక్షంలో పోలీస్ స్టేషన్ కు అందజేసారు.క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు బారికేడ్లు అందజేసినందుకు సిఐ సూర్య అప్పారావు ఎస్ఐ లక్ష్మీకాంతం సంస్థ సిబ్బందిని అభినందించారు.ఈ కంపెనీ కార్యకలాపాలు 18 రాష్ట్రాలలో విస్తరించి మొత్తం 2061 గలవని అన్నీ బ్రాంచిల పరిధిలో సి యస్ ఆర్ నిర్వహిస్తున్నారని,మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న 62 బ్రాంచుల పరిధిలో పోలీస్ స్టేషన్ లకు, సహకరించారని తెలిపారు.సి ఎస్ ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రజా అవసరాలకు ఉపయోగపడేలా ప్రతి ఒక్కరు ఆలోచన సాగించాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐ సూర్య అప్పారావు,ఎస్సై ఎస్ లక్ష్మి కాంతం,విశాఖపట్నం డివిజనల్ మేనేజర్ వెంకట రమణ,లైజనింగ్ ఆఫీసర్ రమేష్ బాబు,ఏరియా మేనేజర్ జి.రాంబాబు,బ్రాంచ్ మేనేజర్ పి.నానాజీ, స్థానిక బ్రాంచ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.