

బంగారుపాళ్యం, మార్చ్ 1 మన న్యూస్
బంగారుపాళ్యం మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎస్. జాస్మిన్ బాస్కెట్ బాల్ రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయి జాతీయస్థాయిలో పాల్గొని వచ్చిన సందర్భంగా ముస్లిం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ అహ్మద్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షేక్ ఫిరోజ్ అహ్మద్ మాట్లాడుతూ మండలానికి చెందిన ముస్లిం అమ్మాయి ఇంతటి ఘనత సాధించడం మన మండలానికి గర్వకారణమని కొనియాడారు.ఈసందర్భంగా ముస్లిం ఐక్యవేదిక జాస్మిన్ కు సన్మానంతో పాటు పదివేల రూపాయల నగదుతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి షౌకత్,రాష్ట్ర సమన్వయకర్త రషీద్, పూతలపట్టు నియోజకవర్గం అధ్యక్షుడు కాజా, గౌరవాధ్యక్షుడు రహీం తదితరులు పాల్గొన్నారు.