

మనన్యూస్,కర్మన్,గాట్:ఆయుష్మాన్ చికిత్సలయ ద్వారా అన్ని రకాల చికిత్సా విధానాల సమ్మిళితంతో ఒక కొత్త తరహాలో పరిష్కారం చూపించడానికి పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్లో సంక్షేమ సంఘ కార్యవర్గం ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.ఆయుష్మాన్ చికిత్సాలయ దిల్ సుఖ్ నగర్అనుభవజ్ఞులైన ఆయుష్ వైద్యులచే ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్ గౌతమి,డాక్టర్ కరిష్మా, డాక్టర్ మణి బాల,డాక్టర్ ప్రశాంత్,డాక్టర్ పవన్ కళ్యాణ్,డాక్టర్ అవినాష్,డాక్టర్ వంశీ,డాక్టర్ నరసమ్మ పాల్గొని ప్రజలను పరీక్షించి తగు తగు సూచనలు ఇచ్చారు.ఈ వైద్య శిబిరంలో సుమారు 150 మంది పైగా ప్రజలు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.అనంతరం డాక్టర్ గౌతమి మాట్లాడుతూ ఆయుష్మాన్ అంటే
A=ఆయుర్వేదం ,Y=యోగU=యునాని వైద్యం,
S=ఆధ్యాత్మికం H=హోమియోపతి,M=మాన్యువల్ ఫిజియోథెరపీ,
A=ప్రత్యామ్నాయ వైద్యం,
N=ప్రకృతి వైద్యం ,
N=పోషకాహారం) అన్నారు
ఈ కార్యక్రమంలో పవన్ పురి కాలనీ అధ్యక్షుడు జి యాదయ్య, జనరల్ సెక్రెటరీ డి నర్సిరెడ్డి,ట్రెజరర్ ఎల్ మాధవరెడ్డి,వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి,చంద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి,చారి,అక్షయ్ కుమార్,నవీన్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.