24,25 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె..అన్ని బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి వారానికి ఐదు రోజులు పని దినాలు ఉండేలా చూడాలిటిబిఇసిసి ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్

మనన్యూస్,తిరుపతి:అన్ని జాతీయ బ్యాంకులలో ఔట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,బ్యాంకుల్లో ఏళ్ల తరబడి పరిష్కారానికి నేర్చుకొని పలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి జే ధన్వంత కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ లపిలుపుమేరకు శుక్రవారం రామానుజ సర్కిల్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట పలువురు బ్యాంక్ ఉద్యోగులు నిరసన చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ధన్వంత్ కుమార్ మాట్లాడుతూ గత ఏడాది ఐ బి ఏ యూనియన్ నాయకుల ఒప్పందం ప్రకారం 15 రోజులలో తమ డిమాండ్లను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బ్యాంకులలో అన్ని క్యాడర్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.వారానికి ఐదు రోజులే పని దినాలు కల్పించాలని,పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.ఈనెల 24 25 తేదీలలో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోని ఉద్యోగులు అధికారులు సుమారు తొమ్మిది లక్షల మంది సమ్మెలో పాల్గొంటారని గుర్తు చేశారు.అనంతరం యు ఎఫ్ బి యు కన్వీనర్ విజయభాస్కర్ మాట్లాడుతూ గత ఏడాది ఐబీఏ యూనియన్ నాయకులతో ఒప్పందం జరిగినప్పటికీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోవడం దారుణమన్నారు.ఇప్పటికైనా బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విజయ్ భాస్కర్ హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో జనార్దన్ భాస్కర్ కేశవరెడ్డి,సుమలత,రేష్మ,నిర్మల,వెంకటలక్ష్మి మహేష్ మహేష్ బాబు నందకుమార్ పవన్,శంకర్రావు లక్ష్మీపతి నటరాజ్ వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..