మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం.

మనన్యూస్,నారాయణ పేట:రాష్ట్రంలోని మహిళా సంఘాలలో ఉన్న మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మహిళలతో మాట్లాడారు.రాష్ట్రంలో మహిళలు అన్ని విధాల అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.రాష్ట్రంలో మొత్తం 67 లక్షల మహిళలు సంఘాలలో ఉన్నారు.ఆ సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులను విక్రయించేందుకు హైదరాబాద్ శిల్పారామంలో విలువైన స్థలంలో ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు.త్వరలోనే మహిళా సంఘాలలో మరింత మంది సభ్యులను చేర్పించి కోటి మంది సభ్యులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.మహిళలందరూ కోటీశ్వరులు అయ్యే విధంగా తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఇందులో భాగంగానే మొదటగా ప్రతి జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.అనంతరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు ఇస్తామని అన్నారు. మహిళా సంఘాలలో ఉన్న సభ్యులకు ఒక్కొక్కరికి ప్రతి ఏటా రెండు జతల చీరలను అందజేస్తామన్నారు.ఇందుకోసం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు.1000 కోట్ల మెగావట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామన్నారు.ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం వల్ల ఇప్పటికే 600 మంది మహిళలు బస్సుల యజమానులుగా ఉన్నారని తెలిపారు.దేవాలయాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో,విద్యాలయాలకు కూడా అంతే ప్రాథమిక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.పాఠశాలల నిర్వహణ విషయంలో బాధ్యతలు తీసుకోండి అని విజ్ఞప్తి చేశారు.ఉపాధ్యాయులు సక్రమంగా రాకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలని,మిగతా సమయాల్లో అందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేద్దామని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహా,జూపల్లి కృష్ణారావు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,సీతక్క,మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ,నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి,ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు శ్రీహరి,వంశీకృష్ణ,ఈ ర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///