

రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం జరగాలంటే కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:
ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టారు,స్థానిక నాయకులు మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు,బస్సా ప్రసాద్ మైరాల కనకారవు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల అవగాహన కార్యక్రమానికి యం యల్ సి ఎన్నికల పరిశీలకులుగంటా నూకరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్సీ ఎన్నిక విధానం పట్ల స్థానిక నేతలతో ఓటర్లకు అవగాహన కల్పించారు అనంతరం గ్రామంలో వాటర్లకు కరపత్రాలు పంచారు.కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరంను తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వాటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా అబ్జర్వర్ నూకరాజు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ఒక కూటమి ప్రభుత్వాము వల్లే జరుగుతుందని తెలిపారు.రానన్న రోజుల్లో జాబ్ కాలండర్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు ప్రతి ఒక్కరు ఉభయగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరముకి తమ ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు తోట వెంకటేశ్వరరావు యర్రాబత్తుల గోవిందనాయుడు, గంగిరెడ్ల మణికంఠ,ఆకుల నాని,తోట హరి, తదితరులు పాల్గొన్నారు..