మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:
ప్రతిపాడు నియోజకవర్గము,శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ఆదేశాల మేరకు ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎన్డీఏ కూటమి నుండి పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరంకి మద్దతుగా ఎన్డీఏ కూటమి శ్రేణులు ఎన్నికల ప్రచారం.నిర్వహించారు నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు గంటా నూకరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికల ప్రచారం లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్ల అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా పరిశీలకులు గంటా నూకరాజు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరం కి మొదటి ప్రాధాన్యత ఓలేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను కోరాడు.చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది అన్నారు.. పోలవరం, రాజధాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలలో చంద్రబాబు నాయుడు కేంద్రం నుండి పెద్ద మొత్తంలో నిధులు రాబట్టడంలో విజయవంతమయ్యారు అన్నారు. గ్రాడ్యుయేట్ యువకులంతా అభివృద్ధికి పట్టం కట్టాలని, చంద్రబాబుకు మద్దతు ప్రకటించాలని సూకరాజు కోరారు.. కార్యక్రమంలో స్థానిక నాయకులు బౌద్దిరెడ్డి గోపాలకృష్ణ, మూది నారాయణస్వామి, ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి, పెంటకోట మోహన్, ఏలేశ్వరం మున్సిపల్ కౌన్సిలర్లు, ఎన్డీఏ కూటమి శ్రేణులు, మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *