

అమరవాది లక్ష్మీనారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కృషి చేస్తామన్నారు.
మనన్యూస్,కర్మన్ ఘట్:మార్చ్4వ తేదిన జరగబోయే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలకు అమరవాది లక్ష్మీనారాయణ ర్యాలీగా తరలి వెళ్లి లకిడికపూల్ లోని వాసవి భవన్ లో నామినేషన్ వేయడం జరిగింది.ఈ నామినేషన్ కి తెలంగాణలో అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు.అనంతరం కర్మన్ ఘట్ లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అన్ని జిల్లాల అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ నాయకత్వాన్ని బలపరిచారు.అంతేకాకుండా అమరవాది లక్ష్మీనారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కృషి చేస్తామన్నారు.ఈ సందర్భంగా అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తన ఆధ్వర్యంలోనే ఉప్పల్ భగాయత్ ఆర్యవైశ్య మహాసభ కోసం 5 ఎకరాలు భూమిని సాధించానని,అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలని అందరం కూర్చొని చర్చించి,తను ఈసారి ఎన్నికల్లో గెలవగానే భవన నిర్మాణం పూర్తి చేస్తానని తెలిపాడు.