

మనన్యూస్,మీర్పేట్:మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు సమీపంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా మొక్కలు నాటి మాజీ ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మళ్లీ రాజ్యాధికారం లోకి రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలన ప్రజలకు అందించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలను ఒకతాటిపై తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ది ఎవరు అవునన్నా కాదన్నా ఇది అక్షర సత్యం అని తెలిపారు
ఇప్పుడున్న ప్రభుత్వం కెసిఆర్ ఫోటో చూస్తేనే ప్రభుత్వానికి భయమేస్తుంది అందుకే కేసిఆర్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించి వేస్తున్నారు కానీ ఫ్లెక్సీలను చించి వేయవచ్చు కానీ ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరు అది గుర్తుపెట్టుకోవాలి అని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి,సిద్దాల లావణ్య, దిండు భూపేష్ గౌడ్,దీప్లాల్ చౌహాన్,అర్కల భూపాల్ రెడ్డి,శీను నాయక్,విజయలక్ష్మి రామిడి రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.