

మనన్యూస్,తిరుపతి:తిరుపతి నగరాభివృద్ధికి దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ సూచించారు.తిరుపతి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ఆర్సి మునికృష్ణ శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కార్పొరేటర్ అన్నా అనిత పలువురు కూటమి నేతలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.