

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: భారత మాజీ ప్రధాని, భారత రత్న డాక్టర్ ఎ బి వాజపేయి శత జయంతోత్సవాలు సందర్భముగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు సూచనలు అనుసరించి ఆదివారం ఏలేశ్వరం మండలం సిరిపురం లో బీజేపీ సీనియర్ నాయకులు కొల్లా శ్రీనివాస్ ని బీజేపీ శ్రేణులు సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అటల్ జీ ప్రధానిగా దేశ అభివృద్ధి సంక్షేమ పథకాలు, సంస్కరణల ద్వారా ప్రగతి వథంలో ముందుకు తీసుకువెళ్ళిన మహానియుడని, కవి, రాజనీతిజ్ఞుడు సుపరిపాలన దక్షుడు, దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శ పురుషుడని కొనియాడారు. బీజేపీ ప్రత్తిపాడు మండల పూర్వ అధ్యక్షులు కంద వీరాస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు గున్నాబత్తుల రాజబాబు, మణికంఠ,నూకరాజు, 61 వ బూత్ బీజేపీ సభ్యులు వెంకట లక్ష్మీ, రామ తులసి, లక్ష్మీ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.