మన న్యూస్,తిరుపతి, ఫిబ్రవరి 15:షష్ఠి షణ్ముఖ యాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం తిరుత్తణి కి చేరుకోగా ఆయనకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి సుబ్రమణ్యం స్వామి ఆలయం కు చేరుకోగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుత్తణి ఆలయంలో పూజలతో షష్ఠి షణ్ముఖ యాత్ర ముగిసింది. దీనితో పవన్ కళ్యాణ్ విజయవాడకి బయలుదేరి వెళ్లారు. ఈ పూజల్లో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్, టిటిడి బోర్డు మెంబర్ ఆనంద్ సాయి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నగర అధ్యక్షులు రాజా రెడ్డి, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *