

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంతో పల్లెలు పరిశుభ్ర వాతావరణంతో పాటుగా అహ్లాదకరమైన రీతిలో ఉంటాయని మండల అభివృద్ధి అధికారి కెవి సూర్యనారాయణ అన్నారు. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ నిర్వహించాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏలేశ్వరం లింగంపర్తి పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించారు.మండల గ్రామాల్లోని గ్రామ సచివాలయాల వద్ద అధికారులు, గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ సంయుక్తంగా, మానవహారాలు నిర్వహించి స్వచ్ఛ ఆంధ్ర ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా కె.వి సూర్యనారాయణ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. గ్రామాలన్నీ స్వచ్ఛంగా మారినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రగా మారుతుందన్నారు. అనంతరం పారిశుధ్య నిర్వహణలో లోపాలు తలెత్తకుండా పల్లెలను పరిశుభ్రతకు నెలవుగా మారుస్తామని ప్రతిజ్ఞలు చేశారు. అంటువ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాల సిబ్బంది, మరియు ఉపాధి హామీ ఫీడ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.