

మనన్యూస్,ఎల్,బి,నగర్:ఎల్బీనగర్ లోని న్యాయస్థానం కోర్టులో న్యాయమూర్తి పై దాడి ఘటనను అడ్వకేట్ హరికృష్ణ తీవ్రంగా ఖండించారు.ఒక కేసులో కరణ్ సింగ్ అనే వ్యక్తికి రంగారెడ్డి కోర్టులో 9 ఎడిజే కోర్టు న్యాయమూర్తి హరీష మహిళా జడ్జ్ అతనికి జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది.ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నిందితుడు కరణ్ సింగ్ జడ్జి పై చెప్పు విసరడం చాలా దారుణమైన సంఘటన ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.ఈ దేశంలో న్యాయమూర్తులకు న్యాయవాదులకు సరైన రక్షణ లేకుండా పోయింది.న్యాయం చేయడం కోసం న్యాయమూర్తులు ఉంటారు వారిపై ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం.న్యాయమూర్తులకు న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కక్షిదారుల నుంచి నేరస్తుల నుంచి రక్షణ కల్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం నిందితున్ని తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాం.అడ్వకేట్ హరికృష్ణ మాట్లాడుతూ నేటికీ ఈ సమాజంలో నేరాలు వాటి గల శిక్షలు గురించి ప్రజల్లో ఎలాంటి అవగాహన లేదని అందుకే చాలా దారుణాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా అన్నారు.