

మనన్యూస్,తవణంపల్లె:ఐదేళ్ల వైసిపి హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్న వారిలో ఒకడు వంశీ.ఒక దళితున్ని కిడ్నాప్ చేసి కోట్టి బెదిరించిన కేసులో అరెస్టు చేస్తే వైసిపి నాయకులు నానా యాగి చేయటం దురదృష్టం.దళితుడు కుటుంబ పక్షాన నిలబడి ఆ కుటుంబానికి న్యాయం చేయమని అడగవలసింది పోయి.ఈ వంశీ పక్షాన డీజీపీని కలవడానికి ప్రయత్నించడం,కలవకపోతే రాష్ట్ర ప్రభుత్వం పైన నెపం నెట్టేయడం విచిత్రంగా ఉంది.రాష్ట్రంలో అనేకమంది ఉన్నార వారిలో ఒకరు వంశీ.వల్లభనేని వంశీ చరిత్ర మొత్తం నేరమయం.కిడ్నాప్లు హత్యలు,దుమ్మీలు,దోపిడీలు,భూకబ్జాలు,క్యాసినోలు నడపడం,పేదల భూములు ఆక్రమించడం,ఇతనికి వెన్నతో పెట్టిన విద్య.వంశీ నీ అరెస్ట్ చేయడంతో ప్రజలందరూ సంబరాలు చేసుకుంటుంటే.వైసీపీ నాయకులు ఇతనిది అక్రమ అరెస్ట్ అని ప్రెస్ మీట్ లు పెట్టడం దురదృష్టకరం.వల్లభినేని వంశీకి మద్దతు పలికినటువంటి అంబటి రాంబాబు,లేళ్ల అప్పిరెడ్డి,వీళ్ళందరికీ తగిన గుణపాఠం నేర్పిస్తాం.తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే కానరాని వీళ్ళు ఈరోజు రాజ్యాంగం గురించి,శాంతి భద్రతల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వర్నిస్తున్నట్టుంది.ఈ యొక్క ప్రెస్ మీట్ లో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్,జిల్లా క్రిస్టియన్ ప్రెసిడెంట్ మెషక్,నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు ధరణి ప్రకాష్,సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.