రుయా లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసిన కలెక్టర్
మెరుగైన వైద్య సేవలు అందించాలి..

మన,న్యూస్,తిరుపతి:రుయా ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసి,మరింత మెరుగైన వైద్య సేవలు పేద ప్రజలకు అందించేలా రుయా ఆస్పత్రిలోని పలు విభాగాలు పనిచేయాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ ఆదేశించారు.శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఓపికగా రుయా ఆసుపత్రి నందలి పలు వార్డులను,విభాగాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి,అడ్మిట్ అయిన రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై,ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై,ఫ్యాన్లు,ఎ.సి లు,మరుగుదొడ్లు,పారిశుధ్య అంశాలు,వైద్య సిబ్బంది అందుబాటు తదితర అంశాలను పరిశీలించి అక్కడిక్కడే అధికారులకు విధి విధానాలపై సూచనలు,ఆదేశాలిచ్చారు. మెరుగైన వైద్యం కొరకు వచ్చే పేద రోగులకు వారి సంతృప్తి మేరకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు.
ముందుగా క్యాజువాలిటీ ఎమర్జెన్సీ వార్డులో ఐసీయూ బెడ్లు అవసరం మేరకు లేవని గమనించిన కలెక్టర్ వైద్యాధికారులను అడిగి 40 బెడ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రోజూ పారిశుధ్య కార్మికులు 220 మంది ఉండాల్సి ఉండగా అందులో ఉదయం 120 మందికి గాను 89 మాత్రమే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాజువాలిటీ,ఎమర్జెన్సీ మెడికల్ వార్డులలో మరుగుదొడ్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని,డోర్స్,మెష్ తదితరాలు సక్రమంగా ఏర్పాటు ఉండాలని సూచించారు.అవసరమైన అల్మారాలు 4,క్రష్ ట్రైలర్స్ రెండు కొనుగోలు చేయాలని సూచించారు.ఎమర్జెన్సీ వార్డ్ నందు పేషంట్లు ఉండే బెడ్ నకు నాలుగు వైపులా క్లోజ్ చేసేలా తెరలు ఉండాలని ఆదేశించారు.వైద్యాధికారులు సిబ్బంది కూర్చునే సీటింగ్,కప్ బోర్డులు ఏర్పాటు పేషంట్లకు ఎక్కువ బెడ్లు సర్దుబాటు అయ్యేలా ఉండాలని సూచించారు.వినియోగంలో లేని పనికిరాని సామాగ్రిని నిబంధనల మేరకు డిస్పోజ్ చేయాలని ఆదేశించారు.అక్యూట్ మెడికల్ కేర్ నందు అవసరమయ్యే మందులను ఫార్మసీ సిబ్బంది,అడ్మినిస్ట్రేటర్ ముందస్తుగా గుర్తించి తదనుగుణంగా మందుల కొరత లేకుండా ఏపీఎంఎస్ఐడిసి వారి వద్ద నుండి సరఫరా లేని మందులను స్థానికంగా కొనుగోలు చేసి వైద్య సేవలకు వచ్చే పేద రోగులకు ఇవ్వాలని,ఇప్పుడు అందుబాటులో లేని మందులను జాబితా తయారు చేసి 24 గంటలలోపు మందుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలక్ట్రోలైట్ పరీక్షలు రోగులకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించగా ఆటో అనలైజర్ మిషన్ సమస్య అని అధికారులు తెలుపగా ఆటో ఎనలైజర్ తొందరగా ఇన్స్టాల్ చేసి సోమవారం నాటికి అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, మరమ్మతులకు గురైన 3సీరం ఎలక్ట్రోలైట్ టెస్టింగ్ మిషన్లను సత్వరమే అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు.అలాగే ఓపి విభాగాలు,వాటి మార్గాలు,సంబంధిత సంఖ్య వివరాలు ప్రస్ఫుటంగా కనపడేలా గ్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఓపి విభాగం,ఎమర్జెన్సీ విభాగాలు తదితర ప్రాంతాలలో సరైన వెలుతురు లేదని లైటింగ్ ఏర్పాటు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని వారంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు.వైట్ వాష్ చేయించాలని,ఎక్కడపడితే అక్కడ ఉన్న స్టిక్కర్లను పోస్టర్లను తొలగించాలని ఆదేశించారు. గేరియాట్రిక్ వార్డును జనరల్ మెడిసిన్ నందు షిఫ్టింగ్ చేయడం ద్వారా ఓపి బ్లాక్ సంఖ్య పెంచాలని సూచించారు.ల్యాబ్ ఇన్ఫర్మేషన్ సిస్టం e- హాస్పిటల్ విధానం ఏర్పాటు నెలలోపు జరగాలని,ల్యాబ్ రిపోర్టులు అందులోనే జరగాలని అవసరమైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ లు టెక్నీషియన్లను వినియోగించుకోవాలని ఆదేశించారు.ఎంఆర్ఐ సిటీ స్కాన్ రిపోర్టులు పరీక్షలు నిర్వహించిన అదే రోజు పేషెంట్లకు అందించాలని సూచించారు.చికిత్స కొరకు వచ్చే పేషంట్ల సహాయకులు ఉండడానికి నిర్మాణంలో ఉన్న భవనాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులను ప్రశ్నించగా దాత నిధుల ద్వారా నిర్మాణం చేపట్టామని నిధుల కొరత వలన ఆగి ఉందని తెలుపగా పెండింగ్ పనులు పూర్తి చేయుటకు అవసరమైన నిధులను కలెక్టర్ సమకూరుస్తామని నెలలోపు భవనాన్ని పూర్తి చేయాలని ఏపీఎంఎస్ఐడిసి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.28 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన సెంట్రల్ డ్రగ్ స్టోర్ ను మరియు న్యూ సిటీ డయాగ్నస్టిక్ సెంటర్ ను పరిశీలించి మార్చి 15నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని,సైన్ బోర్డ్ లు ఏర్పాటు ఉండాలని అధికారులను ఆదేశించారు. రుయా నుండి ఫార్మసీ స్టోర్ సిడిఎస్ బిల్డింగ్ లోనికి ఫిబ్రవరి నెల ఆఖరి నాటికి పూర్తిస్థాయిలో షిఫ్ట్ చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు,డి ఎం హెచ్ ఓ బాలాజీ నాయక్,ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్,సి ఎస్ ఆర్ ఎమ్ ఓ సుబ్బలక్ష్మమ్మ, ఎ సి ఆర్ ఎమ్ ఓ హరికృష్ణ,ఏపీఎంఎస్ఐడిసి ఈఈ శివరామి రెడ్డి,హెచ్ డి ఎస్ సభ్యులు సందీప్,షేక్ ఖాజా మొహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//