మల్లమ్మ కుంట లో 90% దళితుల భూములు లాక్కొని,ప్రాజెక్ట్ నిర్మించడము దుర్మార్గ ప్రక్రియ అని ,తెలంగాణ రాష్ట్ర యువ నాయకుడు KMS. శ్రావణ్ కుమార్ రాయల్ తో గోడు విన్నవించుకున్న తనగల రైతులు

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలం లోని,నారాయణ పురం గ్రామంలో,తెలంగాణ స్టేట్ యూత్ లీడర్ KMS. శ్రావణ్ కుమార్ రాయల్ ,VHPS లీడర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో కలిసి,తనగల రైతులు తమ యొక్క గోడును విన్నవించుకున్నారు మల్లమ్మ కుంట అనే ప్రాజెక్టు పేరుతో మమ్ములను దుర్మార్గంగా నాశనం చెయ్యడం చాలా బాధాకరం అని,మేము అంతో కొంత,ఆత్మ గౌరవం తో బ్రతుకుతున్న,మా యొక్క భూములను,లాక్కోవడం ఎంతో దుర్మార్గం అని.ప్రభుత్వ అధికారులు రాజకీయ పెద్దలు,567 ఎకరాలు మల్లమ్మకుంటా కోసం సేకరించాము అని,దానిలో 500 ఎకరాలు కేవలం ఒక్క దళితుల భూమి ని లాక్కోవడంఅనే,కుట్ర అర్థం చేసుకోగలరు అని,అదేవిధంగా,ఇక్కడ భూములు ఏవి బంజర భూములు లేవు,అన్ని సాగు భూములు,మంచి తోటలు పండే భూమిని లాక్కోవడం ఎంత వరకు సమంజసం అని,ఇక్కడ ప్రాజెక్టును కట్టిన కూడా,7కిలోమీటర్లు లిఫ్ట్ ద్వారా,తీసుకెళ్లడం,చుస్తే,కావాలని ఈ కుట్ర బడా నాయకులు చేస్తున్నారు అని,తుమ్మిళ లిఫ్ట్ ఇరిగేషన్ పక్కలోనే ఉండటం వలన,ఎలాంటి నీటి ఇబ్బంది వుండదు,కానీ,కావాలనే,దళితులకు ఉన్న ఈ భూమిని లాక్కుంటే,వాళ్ళు మళ్ళీ మా కిందకు వచ్చి,జీతాలు చేస్తారు అని,బడా అగ్ర కుల నాయకులు చేస్తున్న కుట్ర అని,మల్లమ్మ కుంట భూమి కి భూమి పోతే,తనగల గ్రామంలో ని,దళిత కుటుంబాలకు,సెంటు భూమి కూడా ఉండదు అని,అక్కడ ఇందిరమ్మ గారు 50 ఎకరాలు సీలింగ్ భూమి ఇచ్చి యున్నది,ఇచ్చిన భూమిని లాక్కుంటే,మా బ్రతుకులు ఎలా బ్రతకాలి, మళ్ళీ మాకు వలస,గాసం పని మాత్రమే దిక్కు అవుతుంది,అని మా ప్రాంతంలో ని అగ్ర కుల బడా రాజకీయ నాయకుడు మాట్లాడటం,మాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి అనిగత ప్రభుత్వం కు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాము,వాళ్ళు ఆపారు,కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు మారుతాయు అనుకున్నాము కానీ,మళ్లీ మా బ్రతుకుల మీద నీళ్లు చల్లుతున్నారు అని,రాజకీయ పెద్దలు తో మాట్లాడి,మాకు న్యాయం చేపించగలరు,అని,గోడుని KMS. శ్రావణ్ కుమార్ రాయల్ విన్నవించుకున్నారు
తర్వాత KMS.శ్రావణ్ కుమార్ రాయల్
మాట్లాడుతూ మీ గోడును స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి SA.సంపత్ కుమార్ దృష్టికి,స్థానిక MP.మల్లు రవి దృష్టికి తీసుకెళ్లి,ఇరిగేషన్ మంత్రి,CM దృష్టికి చేరేలా కృషి చేస్తాను అని,తెలంగాణ రాష్ట్ర యువ నాయకుడు KMS. శ్రావణ్ కుమార్ రాయల్ గారి,వారికి భరోసా ఇచ్చి మాట్లాడటం జరిగింది,తర్వాత తనగల గ్రామస్తులు,ఆత్మీయముగా శాలువా,పూల దండ తో,సన్మానించారు ఈ యొక్క కార్యక్రమంలో మనవపాడు యూత్ కాంగ్రేస్ అధ్యక్షుడు కాశపోగు శేఖర్,యూత్ కాంగ్రెస్ ఇటిక్యాల మండలం అధ్యక్షుడు సంకటి రాజేష్,యూత్ లీడర్స్ నాగరాజు,వెంకటేష్,తనగల గ్రామస్థులు,జయరాజు,యిలియజర్,వెంకటేశ్, పురుషోత్తమ్,లబాన్,పేతురు,రాజన్న,తిరుమలేష్,గట్టన్న,రాజన్న,వరదరాజు,ఉమ్మయ్య,బీసన్న,ఎసన్న,నాగరాజు,పాల్,రాజు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గ జాతీయ జెండా ఆవిష్కరించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎందరో మహనీయుల త్యాగఫలం వల్ల రాచరికపు పాలన నుంచి…

    9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల

    మన ధ్యాస,నిజాంసాగర్,(జుక్కల్) నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మంగళవారం ప్రాజెక్టు ద్వారా 9 వరద గేట్లను ఎత్తి దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • September 17, 2025
    • 3 views
    ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన

    విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన

    దళితుల పక్షాన దళిత ప్రజా సమితి…

    దళితుల పక్షాన దళిత ప్రజా సమితి…

    మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

    • By JALAIAH
    • September 17, 2025
    • 3 views
    మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

    పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్

    • By JALAIAH
    • September 16, 2025
    • 5 views
    పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 16, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు