రేణిగుంట మండల అధ్యక్షులు చినతోటి నాగరాజు , రేణిగుంట పట్టణ అధ్యక్షురాలు ఆకుల భాగ్యలక్ష్మి , మరియు రేణిగుంట మండల నాయకుల ఆహ్వానం మేరకు, జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ లో చేరి తిరుపతి పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులైన మిద్దెల హరి , జనసేన పార్టీ నాయకులు సత్రవాడ ప్రవీణ్ రేణిగుంట మండల జనసేన పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశం స్థానిక రేణిగుంట పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో రేణిగుంట మండల సమస్యలు, రాబోయే స్థానిక ఎన్నికల గురించి మండల నాయకులు తో విపులంగా చర్చించడం జరిగింది.
మిద్దెల హరి మాట్లాడుతూ అందరితో కలసి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ యొక్క గెలుపు స్థానాలను పార్లమెంట్ కమిటీ ద్వారా పరిశీలించి ,కూటమి రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకొని జనసేన పార్టీ స్థానిక సంస్థల కోటా విషయంలో రాజీ లేకుండా రేణిగుంట మండలానికి సరైన ప్రాతినిధ్యం వచ్చేలా చూస్తామని తెలిపారు, తిరుపతి పార్లమెంట్ కార్యనిర్వాహక దళ సభ్యుడిగా నియమితులైన చినతోటి నాగరాజు ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
సత్రవాడ ప్రవీణ్ మాట్లాడుతూ రేణిగుంట మండలం లో జనసైనికులకు, నాయకులకు ఎటువంటి సమస్య వచ్చిన ముందుండి సమస్య తీరడానికి పూర్తిగా అండగా నిలుస్థామని జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు , వీర మహిళలను, కార్యకర్తలను అందరిని కలుపుకొని శ్రీకాళహస్తి నియోజకవర్గం లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో..
రేణిగుంట మండలం ప్రెసిడెంట్ మరియు తిరుపతి పార్లమెంట్ నిర్వాహకద్దల్ సభ్యులు చిన్న తోట నాగరాజు , రేణిగుంట టౌన్ ప్రెసిడెంట్ ఆకుల భాగ్యలక్ష్మి , రేణిగుంట ఐటి కోఆర్డినేట్ దీన్ దయాల్ , సీనియర్ నాయకులు, త్యాగరాజు , మాజీవార్డ్ నెంబర్ మహబూబ్ భాషా , ఎస్.ఎం.సి. గర్ల్స్ హై స్కూల్ చైర్మన్ సుజా తా , వైస్ చైర్మన్ కరీముల్లా , కోఆర్డినేట్ నెంబర్ అనురాధ , జనసేన నాయకులు…..
పార్థసారధి , ముఖేష్ . రమేష్ , మునికృష్ణ , సలీం , తిలక్ , ఆర్.సతీష్, వెంకటేష్ , బసవ పున్నయ్య , నరేష్ కుమార్, యస్.రమేష్, మహేష్, వీరమహిళలు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.


