

రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే సచిన్ పైలెట్
మనన్యూస్,అబ్దుల్లాపూర్మెట్:రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కవాడి పల్లి గ్రామ పరిధిలో రాజస్థాన్ గుజ్జర్ సమాజ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన స్వామి దేవ్ నారాయణ్ మందిర్ ప్రారంభోత్సవంలో రాజస్థాన్ రాష్ట్రం మాజీ ఉప ముఖ్యమంత్రి,కాంగ్రెస్ పార్టీ యువ నేత, ఎమ్మెల్యే సచిన్ పైలట్ పాల్గొని,ప్రసంగిస్తూ దేవాలయాలతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని,భవిష్యత్తులోనూ మరింత అభివృద్ధి జరిగి పేద ప్రజలకు న్యాయం కలుగుతుందని అన్నారు.ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించారు.