

నగల దుకాణంలో చోరీ
పోలీసు జాగిలంతో క్లూస్ టీం పరిశీలన 30 లక్షలు ఆభరణాలు చోరీ
దుకాణం వెనుకవైపు గోడ తవ్వి దొంగతనం
పక్కా వ్యూహంతో వ్యవహరించిన దుండగులు సీసీ కెమెరాలు ధ్వంసం
మనన్యూస్,ఏలేశ్వరం:నగర పంచాయతీ పరిధిలోని మెయిన్ రోడ్డు బాలాజీ చౌక్ సమీపంలో సిద్ధానాద్ జ్యువెలర్స్ లో ఆదివారం రాత్రి షాపుకు వెనుక వైపు ఉన్న 9 అంగుళాల గొడను కటింగ్ మిషన్ తో కట్ చేసి లోపలకు చొరబడి చోరీకి చేశారు.వివరాల్లోకి వెళితే ఏలేశ్వరం పట్టణంలో మహారాష్ట్రకు చెందిన జి శివాజీ అనే వ్యక్తి గత 22 సంవత్సరాలుగా నివాసం ఉంటూ బంగారం వెండి వ్యాపారం నిర్వహిస్తున్నారు.అయితే ఆయన ఈ షాప్ ని గత సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన,ఈ ప్రాంతానికి వచ్చి షాపును ఏర్పాటు చేసుకుని వ్యాపారం ప్రారంభించారు.ఈ నేపథ్యంలో శివాజీ నిర్వహిస్తున్న సిద్ధ నాథ్ జువెలరీ షాప్ నీ సోమవారం ఉదయం యధావిధిగా ఉదయం 9:30 గంటలకు షాపు తెరిచి చూడగా ఆ షాపుకు వెనుక బాగా నా దొంగలు కన్నం వేసి షాపులో ఉన్న లాకర్లను తెరిచే ప్రయత్నం చేశారు.అయితే ఆ లాకర్లో చిన్న లాకర్ ఓపెన్ దానిలో ఉన్న 30 కేజీల వెండి సుమారు 25 లక్షల రూపాయలు విలువ ఉంటాయని,అలాగె 60 గ్రాముల బంగారు నగలు సుమారు 5 లక్షలు రూపాయలు విలువ గలవి ఉంటాయని అవి చోరీకి గురికాగా,పెద్ద లాకరు ఓపెన్ చేయడం వారికి సాధ్యం కాలేదు అన్నారు.షాపులో ఏర్పాటుచేసిన అరల్లో ఉన్న సుమారు 20 వెండి గ్లాసులు,మరో కంచం తో పాటు లక్ష రూపాయలు విలువ ఉంటాయని,ఆవేదన చెందుతూ వెల్లడించారు.షాపులో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా,వాటికి సంబంధించిన హర్ట్ డిస్క్ ను దొంగలించారని,షాప్ యజమాని శివాజీ వెల్లడించారు.తాను ఉదయం షాపు తెరిచి పూజ చేసుకునేందుకు వెళ్ళగా ఈ దొంగతనం జరిగినట్లు గుర్తించాలని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.తాను ఫిర్యాదు చేసిన వెంటనే ప్రత్తిపాడు సిఐ పి సూర్య అప్పారావు,పెద్దాపురం డిఎస్పి శ్రీహరి రాజు,సంఘటన స్థలాన్ని చేరుకుని చోరీ జరిగిన విషయాలను షాపు యజమాని అడిగి తెలుసుకుని పరిశీలించారు.అనంతరం క్లూస్ టీం ఆధారాలు సేకరించారు.అలాగే డాగ్స్ స్క్వాడ్ని రప్పించి,సంఘటన స్థలానికి తీసుకుని వెళ్లి పరిశీలింప చేయగా షాప్ క వెనుకను ఉన్న తిమ్మరాజు చెరువు ప్రధాన కాలువ వరకు వెళ్లి నీరు ఉండడం వల్ల అక్కడి నుండి వెనుతిరిగినట్లు పోలీసులు తెలిపారు