సాలూరు బీసీ హాస్టల్ వార్డెను సస్పెండ్ చేయాలి,,ఎస్ఎఫ్ఐ డిమాండ్

జాయింట్ కలెక్టరుకు వినతిపత్రం అందించిన నాయకులు

మనన్యూస్,సాలూరు:పార్వతీపురం జిల్లా సాలూరులో బీసీ హాస్టల్ లో అన్నం బాగోలేదని అడిగిన విద్యార్థులను హాస్టల్ నుండి తరిమేయడం అన్యాయమని,దీనిని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుందని నాయకులు అన్నారు.సాలూరు బీసీ సంక్షేమ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వార్డెను సస్పెండ్ చేయాలని సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభికకు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్,సింహాచలం మాట్లాడుతూ సాలూరు బీసీ సంక్షేమ హాస్టల్లో 40 మంది విద్యార్థులు ఉంటున్నారని,వీరికి సంక్షేమ హాస్టల్ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న అధికారి సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని,మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని,గత నాలుగు రోజులుగా అన్నము ఉప్మా లాగా వండిస్తున్నారని, ఇదేమి న్యాయమని అడిగిన విద్యార్థులను అనేక బెదిరింపులకు పాల్పడి హాస్టల్ నుండి తొలగించడం అమానుషమని మండిపడ్డారు.ఆదివారం రాత్రి హాస్టల్లో విద్యార్థులకు పెట్టిన భోజనం నాసిరకంగా ఉండడంతో విద్యార్థులందరూ భోజనం కంచాలను తిరగవేశారని.అప్పటికే హాస్టల్ వార్డెన్ కు సమాచారం ఇచ్చిన స్పందించకపోవడంతో అందుబాటులో ఉన్న ఎస్ఎఫ్ఐ నాయకులకు తెలియజేశారని అన్నారు. నాయకుల చొరవత ఇదేమి న్యాయమని అడిగితే మీకేమి సంబంధం లేని విషయమని వార్డెన్ చెప్పడంతో ఒకసారిగా విద్యార్థులందరూ ఆందోళనకు దిగారని అన్నారు. వెంటనే పై అధికారులకు సంప్రదించడంతో సోమవారం ప్రత్యక్షంగా పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో కార్యక్రమం అంతటితో ముగించారని, దీనిని ప్రెస్టేజ్ గా తీసుకున్న హాస్టల్ వార్డెన్ మెను కోసం ఫిర్యాదు చేసిన విద్యార్థులను గుర్తించి సోమవారం ఉదయం నుండి బయోమెట్రిక్ వెయ్యనివ్వకుండా హాస్టల్ నుండి పంపించేసారని జేసి శోబికకు నాయకులు వివరించారు.ఇది కొత్త సమస్య కాదని,గతంలో చాలా సార్లు ఇటువంటి పరిస్థితులు హాస్టల్లో నెలకొందని,ఇది చాలా దారుణమని ఇప్పటికే హాస్టల్లో అనేక సమస్యలకు నిలయంగా ఉందని,మరుగుదొడ్లు చాలా దారుణంగా ఉందని విద్యార్థులందరూ బయటకు పోయే పరిస్థితి ఉందన్నారు.గత రెండు సంవత్సరాలుగా బీసీ విద్యార్థులను హాస్టల్లో చేర్పించకుండా గిరిజన విద్యార్థులతో చలామణి చేస్తున్నారని,దానివలన గిరిజన సంక్షేమ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విద్యార్థుల శాతం తగ్గిపోతుందని తెలిపారు.కావున ఇకనైనా జిల్లా కలెక్టర్,జిల్లా స్థాయి అధికారులు స్పందించి నేరుగా సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోవాలని,అలాగే మెనూ సక్రమంగా పెట్టకుండా విధులు నిర్వహిస్తున్న వార్డెన్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

  • Related Posts

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    శంఖవరం/ రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబాన్ని గుర్తించి మేమున్నాం అంటూ గంగవరం గ్రామ ఆడపడుచులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఇంకా మానవత్వం బతికే ఉన్నాది అనేదానికి ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..