జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలి–జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు.గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున 1 నుండి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నులిపురుగులను నివారించే ఆల్బెండజోల్ మాత్రలను అందించాలన్నారు.ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ,బిసి,మైనార్టీ,గిరిజన ఆశ్రమ పాఠశాలలు,వసతి గృహాలలో ప్రతి విద్యార్థులకు మాత్రలు అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ మాత్రల ద్వారా పిల్లల్లో రక్తహీనత,బుద్ధిమధ్యం నివారించవచ్చు,చదువుల పట్ల ఏకాగ్రత పెంపొందుతుందన్నారు.విద్యాశాఖ,ఏఎన్ఎం,అంగన్వాడీలు సమన్వయంగా పనిచేసి జిల్లాలోని విద్యార్థులందరికీ మాత్రలను అందివ్వాలి అన్నారు.ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, అంగన్వాడి పిల్లలకు మాత్రలు అందించాలన్నారు.అంగన్వాడి టీచర్లకు శిక్షణ ఇచ్చి వయసుల వారీగా మాత్రల డోస్ ఇవ్వాలన్నారు.భోజనం తర్వాతనే ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలన్నారు. మాత్రలు వేసే ప్రదేశంలో తగినంత త్రాగునీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.జిల్లాలో 336,212 మంది ఒకటి నుంచి 19 సంవత్సరాల వయసు గల వారు ఉన్నారని ఆయన తెలిపారు.వారి అందరికీ మాత్రలు అందించాలని తెలిపారు.ప్రత్యేక షెడ్యూల్ ని ఏర్పరచుకొని నులిపురుగుల నిర్మూలన మాత్రలు అందివ్వాలి అన్నారు.ప్రజలకు అర్బెండజోల్ మాత్రల ఉపయోగాలపై కళా జాతర బృందాలు,మహిళా సమాఖ్యల ద్వారా విస్తృత అవగాహన కల్పించి,పిల్లలందరూ మాత్రలు తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. 10వ తేదీన మాత్రలు తీసుకొని వారికి 17వ తేదీన మాప్ ఆఫ్ డే నిర్వహించి మాత్రలు అందించాలన్నారు.ప్రైవేటు విద్యాసంస్థలు అన్ని విద్యార్థులకు మాత్రలు అందేలా చూడాలని,అనంతరం నివేదికలు సమర్పించాలని అన్నారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నులిపురుగుల నిర్మూలలకు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన,జడ్పీ సీఈవో నాగలక్ష్మి,వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్,డిసిహెచ్ఓ రవిబాబు,మహిళా,శిశు,వయోవృద్ధుల సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా,బీసీ సంక్షేమ అధికారి ఇందిరా,ఎస్సీ డెవలప్మెంట్ అధికారి అనసూయ,జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///