

మనన్యూస్,కాకినాడ: జగ్గంపేట ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జగ్గంపేట శాసనసభ్యులు,టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు.గురువారం జగ్గంపేట రాజమండ్రి రోడ్ లో గల పరిణయ ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.జగ్గంపేట నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, ఉభయగోదావరి జిల్లాల పట్టబత్తుల ఎమ్మెల్సీ పే రాబత్తుల రాజశేఖర్,జగ్గంపేట నియోజకవర్గం జనసేన,బిజెపి ఇన్చార్జి లు తుమ్మలపల్లి రమేష్, దాట్ల కృష్ణ వర్మ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిబద్దతకు మారుపేరుగా,పార్టీకు విశేష సేవలు అందించిన విద్యావంతుడు,ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు గ్రామ గ్రామాన ఓటర్లతో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 6,500 ఓటర్లు ఉన్నారని,ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలిసి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమం వివరించి ఓటు అడగాలని సూచించారు.నియోజవర్గంలో ఉన్న 14 మంది బూత్ ఇన్చార్జిలను సమన్వయం చేసుకుంటూ కూటమి నాయకులు ముందుకెళ్లాలన్నారు.విద్యావంతులైన ఓటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పురోభివృద్ధి కోసం చేస్తున్న సేవలను వివరించి ఓటు వేసేలా చూడాలని కోరారు.ఈ సమావేశంలో తెలుగుదేశం,,జనసేన,బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.