

Mana News;- గాజువాక హై స్కూల్ రోడ్ సాయిరాం నగర్ లోగల స్వామి విద్యానికేతన్ కూర్మమ్మ స్కౌట్స్ ట్రూప్ మరియు గైడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో సాయిరాం నగర్, శంకర్ నగర్, మారుతి నగర్, అశోక్ నగర్, గాంధీనగర్, ఆటోనగర్, జోగవానిపాలెం, సింహగిరి హాస్పిటల్, నవత రోడ్, పెంటయ్య నగర్, కృష్ణానగర్, బొజ్జోనకొండ, మరియు హై స్కూల్ రోడ్డును కలుపుతూ గాజువాక మెయిన్ రోడ్డు వరకు సుమారు *రెండు గంటలపాటు 5 కిలోమీటర్లు ప్రపంచ క్యాన్సర్ డే సంబంధించిన స్లొగన్స్ ఇస్తూ ర్యాలీ కొనసాగింది* ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా ప్రదగంట్యాడ ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ పి హేమలత గారు* విచ్చేసి విద్యార్థులకు వివిధ కాలనీల ప్రజలకు మహమ్మారి క్యాన్సర్ ను ఉద్దేశించి వాటి లక్షణాలతో పాటు ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగింది. అదేవిధంగా *జీవీఎంసీ 67వ వార్డు కార్పొరేటర్ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు డాక్టర్ హేమలత గారితో పాటు స్కౌట్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది.* ఈ కార్యక్రమంలో *స్వామి విద్యానికేతన్ ప్రిన్సిపల్ మరియు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ లక్ష్మణ స్వామి పాలూరు గారు మాట్లాడుతూ..**ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. దీనిని 2000 సంవత్సరం నుండి యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు అని.**ఈ రోజున క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, దాని నివారణ మరియు చికిత్స గురించి తెలియజేయడం ముఖ్య ఉద్దేశం. క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి, దీనిని ముందుగా గుర్తిస్తే నయం చేయవచ్చు అని.ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్వామి విద్యానికేతన్ లో ప్రతి ఏడాది అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మరియు. క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు డాక్టర్ హేమలత గారి లాంటి వైద్యాధికారులను పిలిపించి ప్రదర్శనలు, సెమినార్లు, అవగాహన ర్యాలీలు నిర్వహించడం. అంతే కాకుండా, క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి వివిధ స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తున్నట్లు అంతేకాకుండా ఈ క్యాన్సర్ మహమ్మారి ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో ఏ భాగంలో వస్తుందో ఈ వైద్య పరంగా అభివృద్ధి చెందిన కాలంలో కూడా అంతుచిక్కని సమస్యగా ఉండటం వలనప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చు అని తెలియజేస్తూ మరియు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుకుంటారు అని. క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, దాని నివారణ మరియు చికిత్స గురించి తెలియజేయడం స్వామి విద్యానికేతన్ పాఠశాల స్కౌట్స్ మరియు గైడ్స్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి, దీనిని ముందుగా గుర్తిస్తే నయం చేయవచ్చు. క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు ప్రతి విద్యా సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలు ర్యాలీలు మరియు ప్రదర్శనలు ద్వారా క్యాన్సర్ యొక్క లక్షణాలు ముందు జాగ్రత్త చర్యలు తెలియజేస్తే సమాజంలోప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చు అని ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రిన్సిపల్ లక్ష్మణ స్వామి గారు తెలియజేశారు. ఈ *కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి పాలూరు దేవి, పాఠశాల ఇంచార్జ్ శ్రీమతి గరిమెళ్ళ పద్మజాపూర్ణ, సింగిరెడ్డి లక్ష్మి, రేగు మోహన్, అచ్యుతుని లక్ష్మి తదితరు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు స్కౌట్స్ ర్యాలీ పొడవున పాల్గొన్నారు అని పి.ఎల్ స్వామి తెలిపారు.
