

మనన్యూస్,తిరుపతి:క్యాన్సర్ గురించి సరి అయినా అవగాహన ఉంటే నివారించడం మరియు విజయవంతంగా చికిత్స అందించడం సాధ్యం.మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఏ చంద్రశేఖరన్ కనుక క్యాన్సర్ పై అవగాహన కలిగించడం ఈ ప్రపంచ క్యాన్సర్ దినం యొక్క లక్ష్యం.అందుకనే క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ,గుర్తింపును,చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతీయేట ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా గుర్తిస్తారు అని ఆయన తెలిపారు.తిరుపతి జిల్లా వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్,ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 లక్షల మందికి పైగా క్యాన్సర్తో మరణిస్తున్నారు.అంతే కాకుండా,మరణాల జాబితాలో క్యాన్సర్ రెండవ ప్రధాన కారణం.చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రతి పది మరణాలలో ఏడు మరణాలు క్యాన్సర్ వలెనే సంభవిస్తున్నాయని ఒక అంచనా ఆయన తెలిపారు.రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి రవి ప్రభు మాట్లాడుతూ ఈ మరణాలను క్యాన్సర్ వలన కలిగే ఆరోగ్య సమస్యలను జీవన శైలి మార్పుల ద్వారా మరియు క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా చాలావరకు నివారించ వచ్చు అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.రుయా ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ టీ భారతి,క్యాన్సర్ గురించి క్లుప్తంగా వివరించారు.క్యాన్సర్ అంటే
క్యాన్సర్ అనేది శరీరంలోని కొన్ని కణాలు అదుపు లేకుండా పెరిగిపోతూ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే పరిస్థితి.క్యాన్సర్ చాలా తీవ్రమయ్యి శరీరంలో అనేక భాగాలకు వ్యాపించే వరకు బయటకు ఏ లక్షణాలు కనబడక పోవచ్చు. అయితే కొన్ని పరీక్షల ద్వారా కొన్ని రకాల క్యాన్సర్ లను ముందుగానే గుర్తించి సరి అయిన చికిత్స చేయడానికి ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి.ఈ కార్యక్రమంలో ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సత్యనారాయణ మూర్తి,ప్రసూతి ఆసుపత్రి విభాగాధిపతి డాక్టర్ ప్రమీల,సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి,క్యాన్సర్ ప్రోగ్రాం నోడల్ ఆఫీసర్ డాక్టర్ శివకళ,డాక్టర్ రోజా రమణి,డాక్టర్ చండీప్రియ రుయా ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ భారతి,డాక్టర్ శ్రీనివాసులు,డాక్టర్ పద్మావతి,ఎన్ సి డి,డాక్టర్ హరిత,వైద్యులు,వైద్య సిబ్బంది,గైనిక్ పీజీ వైద్య విద్యార్థులు,కళాశాల పిఆర్ఓ వీరికిరణ్ తదితరులు పాల్గొన్నారు.