

మనన్యూస్,పినపాక:పినపాక నూతన ఎంపీడీవో సునీల్ కుమార్ ని పినపాక సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిట్టా వెంకటేశ్వర్లు మొక్కను అందజేశారు.నూతన ఎంపీడీవో సునీల్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.ఎవరికి ఎటువంటి సమస్య వచ్చిన తనను సంప్రదించాలన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు కొంపెల్లి సంతోష్ కుమార్,ఉపాధ్యక్షులు యాకన్నా, ప్రధాన కార్యదర్శి గుడికందుల రాజశేఖర్,ట్రెజరర్ గుమాస్ వెంకటేశ్వర్లు,సభ్యులు కొంపల్లి నాగేష్,దొడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.