

మనన్యూస్,బి.యన్.రెడ్డి నగర్:డివిజన్లోని సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ శ్రీపురం కాలనీ కమ్యూనిటీ హాల్లో భ్రంగి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత న్యూరో వైద్య శిబిరం నిర్వహించారు.గ్రూప్ ఆఫ్ భ్రంగి హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ భ్రంగి శిరీష్ కుమార్,కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ గౌతమి ప్రియదర్శిని ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న రోగులకు ఉచిత బిపి,షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి,తగిన మెడిసిన్ అందించారు.ఈ వైద్య శిబిరంలో దాదాపు 300మంది ప్రజలు పాల్గొని వైద్య సేవలు అందుకున్నారు.