

మనన్యూస్,గద్వాలజిల్లా:తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామము ఈ గ్రామ పరిధినుండి మద్యల బండ.మల్దకల్.బింగి దొడ్డి.తాటి కుంట.కుర్తి రావులచెరువు.తప్పేట్లమోర్స్.అలాగే పరిసర గ్రామలా ప్రాంతం లనుండి పలు వాహనాల యాజమాన్యం.డ్రైవర్లు ఎంతమంది ఎక్కువ కూలీలను పత్తి.మిరుప ఇలాంటి పంటపొలాలో పని చేయడానికి తీసుకొని పోతే అంతమంది కూలీలపై కమిషన్ తోపాటు వాహన కిరాయి.ఫుల్ బాటిల్ మద్యం.రెండు కేజీల చికెన్ ప్రై పకోడా.లాంటివి పంటపొలాల రైతు లు ఇచ్చి ఇలా పేద కూలీల బ్రతుకు జీవిత ప్రాణాలతో ఆటలాడుతూ ఉండడమే కాకుండా పోలీస్ అధికారులకు.రోడ్డు రావణ అధికారులకు నెల నెల లంచాల రూపంలో డబ్బులు ఇస్తూ విరికి ఎలాంటి సమస్య ఎదురైనా ఈ అధికారుల సహాయ సహకారాలు ఉండడానికి.అలాగే ప్రజా ప్రతినిధుల సపోర్టు పెట్టుకొని గూడ్స్ వాహనాలలోనూ.తక్కువ సామర్ధ్యం అనుమతులు ఉన్న చిన్న చిన్న వాహనాలలోనూ పరిమితుల సామర్ధ్యం నకు మించి దాదాపు ఒక్కోవాహనములో 40 నుండి 70 మంది కూలీలను ఎక్కించుకొని బాహుబయంకరమైన ప్రమాదలా సమీపంలో కి వారి ఇష్టనుసారంగా అడ్డు అదుపు లేకుండా పేద కూలీల బ్రతుకు జీవిత ప్రాణాలతో ఆటలాడుతూ ఇటు ప్రభుత్వ అధికారులు.అటు వాహనాల యాజమాన్యం అక్రమ అధిక సంపాదనలకు దూరశ కలిగి ఈ కూలీల కుటుంబాలను రోడ్డున పడేలా చేస్తూ వాళ్ళ పిల్లలను అనాధలుగా చేస్తున్నారని.అధికారులకువాహన యాజమాన్యమునకు ఈ పేద కూలీల ప్రజల ప్రాణాలతో అక్రమ సంపాదనలు సమకూర్చుకుంటూ కూలలకు దుఃఖబాధలు కలిగిస్తూనారు.అని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు ఇకనైనా పోలీస్ వ్యవస్థ సరియైన న్యాయపరమైన చర్యలు తీసుకొని చూడటానికి మాత్రం జిల్లా ఎస్ పి బహుమంది పోలీస్ అధికారులను తీసుకొని పోయి ఫొటోలకు పోజులు ఇవ్వడం కాదు ప్రజల సొమ్మును వృధా ఖర్చులు చేసి తప్పుడు లెక్కలు చూపి చోద్యం చూస్తూ చేతులు దులుపుకోవడం కాదు అని ఈ ప్రాంత ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు ఇకనైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.ఈ ఆరోపణలు అబద్దం కాదు ఇవి నిజం వీడియో.ఫొటోస్ ఆధారాలు ఉన్నాయి అంటున్నారు ప్రజలు