

మనన్యూస్,నెల్లూరు:రాంజీ నగర నియోజకవర్గ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర మరియు రూరల్ నియోజకవర్గ కార్పొరేటర్ల తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి,నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆనం విజయ కుమార్ రెడ్డి తో కలిసి వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఫిబ్రవరి 3న జరగబోయే డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమంలో వ్యవహరించాల్సిన తీరుపై నేతలతో కాకాణి గోవర్ధన్ రెడ్డి,పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేటర్లతో చర్చించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభిప్రాయానికి అనుగుణంగా కార్పొరేటర్లు లందరూ నడుచుకోవాలని సూచించారు.అనంతరం ఆనం విజయకుమార్ రెడ్డి,పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు కార్పొరేటర్ల తో కలిసి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై గెలిచిన వారికి తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చి ఎన్నిక బరిలో నిలపడం శోచనీయమన్నారు.ఇలాంటి చర్యలు మూలంగా తెలుగుదేశం పార్టీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని వ్యాఖ్యానించారు.తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చి డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తే మాత్రం. దానిపై ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
