తవణంపల్లి జనవరి 30 మన న్యూస్

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం పోలీస్ స్టేషన్ ఎదుట రహదారి కూడలిలో గురువారం సాయంత్రం చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు, తవణంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి సూచనల మేరకు, వాహనదారులకు తలకు దెబ్బలు, గాయాలు తగులకుండా, ప్రాణహాని జరగకుండా ప్రమాదాలు నివారించేందుకు హెల్మెట్ వాడాలని వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క వాహనదారులు హెల్మెట్ తో పాటు లైసెన్స్ పొల్యూషన్ సర్టిఫికెట్స్, వాహనాలకు సంబంధించిన రికార్డులు కలిగి ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు సూచనలు పాటించి అతివేగంగా ప్రయాణించకుండా ఉండాలని తమ ప్రాణాలు తమ చేతుల్లోనే ఉన్నాయని ఈ విషయం ప్రతి ఒక్క వాహనదారుడు గుర్తించాలని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మునివేలు, శాంతి, హెడ్ కానిస్టేబుల్ అమీర్ భాష, తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *