

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం :ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల,నందు జాతీయ ఓటర్ల దినోత్సవం ను డిపార్ట్మెంట్ ఒఫ్ పోలిటికల్ సైన్స్ మరియు ఎన్‌ఎస్‌ఎస్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్య క్రమానికి ప్రిన్సిపల్ డా.డి సునీత అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతు ప్రతి సంవత్సరం జనవరి 25న,భారతదేశం అంతటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటామని 2011 నుండి ఈ ప్రత్యేక దినం,ఓటరు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుని . ఓటు ప్రాముఖ్యత గురించి. తమ ఓట్ల ద్వారా దేశ భవిష్యత్తును రూపొందించడంలో పౌరుల పాత్రను తెలియజేయాలనే ఉద్దేశ్యంతో జాతీయ ఓటర్ల దినోత్సవం ఏర్పాటుచేయబడిబడని అందులో భాగంగా ఈ సంవత్సరం 2025 యొక్క థీమ్ ‘ఓటింగ్ లాంటిది ఏమీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను’. అనే అంశం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారని, దేశ నాయకత్వాన్ని రూపొందించడానికి కీలకమైన సాధనంగా ఓటు అని తెలియజేశారు, జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు మరియు బాధ్యత రెండింటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుందని . కాబట్టి ఓటింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్గి ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనేలా పౌరులందరూ ముందుకు రావాలని కోరారు. హక్కులతో పాటు భాద్యతలు కూడా గుర్తెరిగి దేశ అభివృద్దిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. మన నాయకుడు ఎలాంటి వారు కావాలో మనమే నిర్ణహించుకొనే అవకాశం కేవలం ఓటు ద్వారా మాత్రమే సాధ్య పడుతుందని కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్ది ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమమలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. ప్రయాగ మూర్తి ప్రగడ, అద్యపకులు వి రామ రావు , క. సురేశ్. శివప్రసాద్. వీరభద్ర రావు, ఎస్‌కే మదీనా, లక్ష్మి , కె బంగార్రాజు,మేరి రొసిలిన పుష్పా, సతీశ్ మరియు అద్యపకేత సిబ్బంది విద్యార్దులు పాల్గొన్నారు.