

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరం మడలం యర్రవరం గ్రామంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాయకులు నీరుకొండ సత్యనారాయణ బస్సా ప్రసాద్,మైరాల కనకారావులు హాజరయ్యారు . ఈ సందర్భంగా బస్సు వైద్యాధికారి డాక్టర్ మజ్జుష మాట్లాడుతూ
ఈ పశు ఆరోగ్య శిబిరంలో 200 మేకలకు నట్టాల నివారణ మందులు,15 పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స 8 పశువులకు చూడి పరీక్షలు,15 అనారోగ్య పశువులకు వైద్యం. లెగ దూడలకు పెద్ద పశువులకు నట్టల మందులు పంపిణీ చేపట్టారు.పశు వైద్యాధికారి డాక్టర్ మంజూష వెటర్నరీ అసిస్టెంట్ పద్మలత వంశీ అనిత సురేష్ పలువురు రైతులు పాల్గొన్నారు