మనన్యూస్,కర్మన్ ఘాట్:కర్మన్ ఘాట్ లోని గాయత్రి నగర్ చౌరస్తాలో రాక్వెల్ ఫ్రీజర్ సంస్థ హైదరాబాద్ మహానగరంలో తన ఏడో శాఖను లాంఛనంగా ప్రారంభించారు.రాక్వెల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ఈశ్వర్ ఎంటర్ప్రైజెస్ రాక్వెల్ ఫ్రాంచైజ్ యజమానులు సంతోష్,నరేష్ లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా రాక్వెల్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గుప్తా మాట్లాడుతూ కమర్షియల్ రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులు,ఆధునిక యంత్రాలను అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ తయారు చేస్తున్న రాక్వెల్ ఉత్పత్తులు పారిశ్రామిక రంగంలో నూతన ఒరవడులను సృష్టిస్తుందన్నారు.ఫ్రీజింగ్ టెక్నాలజీలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ఫ్రీజర్లు,వాటర్ కూలర్లు, డిస్పెన్సరీలు,మిఠాయి షోకేజీలు,బార్ రిఫ్రిజిరేషన్ యూనిట్లు వంటి శీతలీకరణ యూనిట్లను మార్కెట్ కన్నా తక్కువ ధరలకే అత్యుత్తమ నాణ్యతతో అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాక్వెల్ ఫ్రాంచైజ్ యాజమాన్యం మూర్తి,కృష్ణ కిరణ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *