

బంగారుపాళ్యం-జనవరి 20 మన న్యూస్
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఆంధ్రపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను అమ్మఒడి బృందం ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్న పత్రిక ఆంధ్రపత్రిక అని నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలుపుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిలా పని చేస్తున్న పత్రిక ఆంధ్రపత్రిక అని అన్నారు.ఈ కార్యక్రమంలో అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు,ఎమ్మెల్యే చారటిబుల్ ట్రస్ట్ ఫౌండర్ మల్లి ఆచారి,టెస్లా ప్రకాష్, విజయవాడ అబయ ఫౌండేషన్ మాధుర్య,విజయకుమార్,హుస్సేన్,మదు ఆచారి, జరీనా, సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.