

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని,ఇదొక నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఆదివారం జారీ చేసిన ప్రకటనలో కలెక్టర్ నూతన రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇండ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాలపై ప్రజలు ఆందోళన చెందకుండా ఉండేందుకు కలెక్టర్ స్పష్టంగా తెలియజేశారు.జిల్లాలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అన్నారు.ప్రస్తుత జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో,మున్సిపాలిటీలు,జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరంతరంగ ప్రజా పాలన కేంద్రాలను నిర్వహించి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు,రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.ప్రస్తుత జాబితాలో పేర్లు లేని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొని వారు కూడా ఈనెల 21 నుండి 24 వరకు జరిగే గ్రామసభలలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పథకాలను అమలు పరచడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.