

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని స్థానిక టిడిపి నాయకులు పసల సూరిబాబు కోరుకొండ నూకరాజుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ విజేతలకు బహుమతులు అంద జేశారు.. జూనియర్స్ ,సీనియర్స్ గా రెండు విభాగాలలో జరిగిన ఈ ముగ్గుల పోటీల్లో సుమారు 82 మంది మహిళలు పాల్గొని రంగవల్లులతో సుందరమైన ముగ్గులు వేశారు.. నిర్వాహకులు విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు… సంక్రాంతి వేడుకలు పురస్కరించుకొని ఎమ్మెల్యే సత్య ప్రభ హరిదాసుని సన్మానించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షణలో భాగంగా ఇలాంటి ముగ్గులు పోటీలు నిర్వహించడం అభినందనీయమని. ముగ్గులు వేయడం అనేది ఒక కళ అని, ముగ్గుల పోటీలో పాల్గొని ప్రతి ఒక్కరూ విజేతలగానే భావించాలని అన్నారు.. కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు