

మన న్యూస్,ఎల్.బి.నగర్: టీచర్స్ యొక్క సమస్యలపై మాట్లాడే గొంతుక అసెంబ్లీ లో వినబడాలి,విజ్ఞత తో ఓటు హక్కు ను వినియోగించుకోవాలి,ప్రోగ్రెస్సివ్ రికగనైజడ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పి,ఆర్జి,టి ఏ) అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఎల్.బి.నగర్ నియోజకవర్గం మనసురాబాద్ డివిజన్ మల్లికార్జున నగర్ లోని కమ్యూనిటీ సెంటర్ లో ప్రోగ్రెస్సివ్ రికగనైజడ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్(పి,ఆర్జి, టి ఏ) రాష్ట్రస్థాయి మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో పి ఆర్ జి టి ఏ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు,గురుకుల టీచర్స్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకుల టీచర్స్ సమస్యల పరిష్కారం,సంక్షేమం కోసం ఈ పి ఆర్ జి టి ఏ ఏర్పడిందని, రాష్ట్రవ్యాప్తంగా గురుకుల టీచర్స్ అందరూ ఇందులో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ప్రతినెల రెండవ శనివారం సెలవు దినంగా ప్రకటించాలని, 010 ద్వారా వేతనం,సీసీఎల్ మంజూరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థులైనటువంటి పి శ్రీపాల్ రెడ్డి,వంగ మహేందర్ రెడ్డి లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పి ఆర్ జి టి ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ అశోక్,జెల్ శ్రీనివాస చారీ తదితరులు పాల్గొన్నారు.