
మన న్యూస్,ఎస్ఆర్ పురం :- చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యదర్శి గా ఎస్ఆర్ పురం లోని సికే పురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు కుప్పయ్య ను నియమించినట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కుప్పయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు క్రియాశీల కార్యదర్శి ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా అని గ్రామ స్థాయిలో కార్యకర్తలను ఉత్తేజపరిచి పార్టీ విజయానికి పునాదులు వేస్తామని అన్నారు. తనకు పదవి కేటాయించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
