

మన న్యూస్,చంపాపేట్: ఎల్బీనగర్ నియోజక వర్గం చంపాపేట్ డివిజన్ కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయాoలో వైకుంఠ ఏకాదశి పర్వదినమును వురస్కరించుకొని ఆలయంలో నెలకొన్న శ్రీ కోదండ రామాలయములో శ్రీ సీతారామ చంద్ర స్వామి వార్లకు ఉ.3.30 ని.లకు ప్రత్యేక అభిషేకము, ఆరాధన,అలంకారము అనంతరము ఉ.6.00 గం.ల నుండి శ్రీ స్వామి వారి ఉత్తర (వైకుంఠ) ద్వారా దర్శన భాగ్యం భక్తులకు కల్పించారు.భక్తులు అధిక సంఖ్యలో గోవింద నామ స్మరణతో శ్రీ స్వామి వారిని వైకుంఠ ద్వారం దర్శనము చేసుకొని తరించారు.ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయమును వూల అలంకరణతో సుందరంగా అలంకరించి భక్తులు ఆధ్యాత్మిక వాతావరణము పొందే అనుభూతిని ఆలయ ఈవో లావణ్య ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు కల్పించారు.క్యూ లైన్ల వద్ద,ప్రసాదముల వద్ద ప్రత్యేక ఏర్పాట్ల తో ప్రశాంత వాతావరణo కల్పించారు.