అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం –

మంత్రి గుమ్మడి సంధ్యారాణి

మన న్యూస్ ,సాలూరు ,: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు లోఅత్యాధునిక సౌకర్యాలతో వంద పడకల ఆసుపత్రి పునఃనిర్మాణ పనులు జరగాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు గుమ్మిడి సంధ్యారాణి గుత్తేదారులను ఆదేశించారు. శనివారం సాలూరు పట్టణంలో ఉన్న ఏరియా ఆసుపత్రిని కొత్తగా వంద పడకల ఆసుపత్రిగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ 2025 మార్చి నాటికి ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని తెలిపారు. సమష్టి కృషితో ఆసుపత్రిని అభివృద్ధిపదంలో ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుందామని ఆమె అన్నారు. ప్రస్తుతం ఉన్న ముప్పై పడకల ఆసుపత్రిలో కేవలం పద్దెనిమిది పథకాలు మాత్రమే పని చేస్తున్నాయని అన్నారు. వర్షాకాలంలో రోగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులు పడుకోవడం వల్ల ఇబ్బందులకు పడవలసి వస్తోందని పేర్కొన్నారు. సరైన సమయంలో కరెంట్ పోవడం, ఆసుపత్రికి జనరేటర్ లేకపోవడం, త్రాగు నీటి సరఫరా లేకపోవడం లాంటి సమస్యలను పరిష్కారమే వంద పడకల ఆసుపత్రి నిర్మాణమని మంత్రి అన్నారు. 2019 లో శంకుస్థాపన చేసిన ఆసుపత్రి నిర్మాణ పనులను గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల నత్తనడకన సాగాయని అన్నారు. ఆసుపత్రి ఆవరణలో సెక్యూరిటీ గదిని ఏర్పాటు చేసి, ఎవరు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో నమోదు చేయాలని సూచించారు. పేషంట్లు డాక్టర్లతో దురుసుగా ప్రవర్తించకూడదని కోరారు. డాక్టర్లు కూడా రోగుల పట్ల అభిమానంతో మెలగాలని, మంచి మాటలే రోగిలో దైర్యాన్ని నింపుతుందని తెలిపారు. ఆసుపత్రి మొత్తం సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామని అన్నారు.
2019లో టీడీపీ ప్రభుత్వం హయాంలోనే వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసామని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. ఆసుపత్రిలో ఎవరెవరు డాక్టర్ లు వున్నారో వారి పేరుతో బోర్డులు ఏర్పాటు చేయాలని, వార్డు పేరు, సిబ్బంది వున్నారో, లేదో తెలిపే సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు. రోగులకు ఇబ్బంది లేకుండా వార్డులపై సంబంధించిన ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆసుపత్రిలో ఎటువంటి అసౌకర్యాలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. పనులన్నీ మూడు నెలల్లోగా పూర్తి చేసి, ఆసుపత్రిని అందుబాటులోకి వచ్చేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి కాంపౌండ్ మొత్తం ఎత్తుపల్లాలు లేకుండా రహదారి నిర్మాణం చేపట్టాని, రోగులకు, స్ట్రెచ్చర్ కు ఇబ్బందులు కలగకూడదని తెలిపారు. మంచి నీటి ట్యాంకర్ మంజూరు చేయడం జరిగిందని, గర్భిణీలకు, బాలింతల కొరకు వేడి నీటి సౌకర్యం ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ఆసుపత్రిలో ప్రతీ గదిలోని లైట్లు, ఫ్యాన్లు కచ్చితంగా ఉండాలని, పాడైపోయిన స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రికి ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసి, నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆసుపత్రి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలని, డాక్టర్లు ఆసుపత్రిలో ఉండే సమయం, వెళ్లే సమయం రోగులకు తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రోగులకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి సీనియర్ సిబ్బందిలో ఒకరిని రిసెప్షన్ గా ఉంచాలని ఆమె తెలిపారు. ఆసుపత్రిలో ఉండే మందుల పేర్లను ప్రతీ గదిలో బోర్థులను ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ వైద్యం సాధ్యం కాని రోగులను మాత్రమే వేరే ఆసుపత్రులకు రిఫర్ చేయాలని, సాధ్యమైనంత వరకు ఇక్కడే వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. మందులను బయట కొనుక్కోమని ఎవరిని బలవంతపెట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ఒక గదిని ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ సందర్బంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్ పర్సన్ హోదాలో మహిళా శిశు సంక్షేమ శాఖామాత్యులు గుమ్మడి సంధ్యారాణి, వైకుంఠపు హర్షవర్ధన్, కారేపు చంద్రరావు, కాళ్ళ శ్రీను లను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులుగా నియమించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డియం, హెచ్ ఓ డా:కె.వి.ఎస్ పద్మావతి, సాలూరు ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా: ఎ.కె. రత్న కుమారి,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.మన న్యూస్ సాలూరు డిశంబర్ 28: = పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు లోఅత్యాధునిక సౌకర్యాలతో వంద పడకల ఆసుపత్రి పునఃనిర్మాణ పనులు జరగాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు గుమ్మిడి సంధ్యారాణి గుత్తేదారులను ఆదేశించారు. శనివారం సాలూరు పట్టణంలో ఉన్న ఏరియా ఆసుపత్రిని కొత్తగా వంద పడకల ఆసుపత్రిగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ 2025 మార్చి నాటికి ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని తెలిపారు. సమష్టి కృషితో ఆసుపత్రిని అభివృద్ధిపదంలో ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుందామని ఆమె అన్నారు. ప్రస్తుతం ఉన్న ముప్పై పడకల ఆసుపత్రిలో కేవలం పద్దెనిమిది పథకాలు మాత్రమే పని చేస్తున్నాయని అన్నారు. వర్షాకాలంలో రోగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులు పడుకోవడం వల్ల ఇబ్బందులకు పడవలసి వస్తోందని పేర్కొన్నారు. సరైన సమయంలో కరెంట్ పోవడం, ఆసుపత్రికి జనరేటర్ లేకపోవడం, త్రాగు నీటి సరఫరా లేకపోవడం లాంటి సమస్యలను పరిష్కారమే వంద పడకల ఆసుపత్రి నిర్మాణమని మంత్రి అన్నారు. 2019 లో శంకుస్థాపన చేసిన ఆసుపత్రి నిర్మాణ పనులను గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల నత్తనడకన సాగాయని అన్నారు. ఆసుపత్రి ఆవరణలో సెక్యూరిటీ గదిని ఏర్పాటు చేసి, ఎవరు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో నమోదు చేయాలని సూచించారు. పేషంట్లు డాక్టర్లతో దురుసుగా ప్రవర్తించకూడదని కోరారు. డాక్టర్లు కూడా రోగుల పట్ల అభిమానంతో మెలగాలని, మంచి మాటలే రోగిలో దైర్యాన్ని నింపుతుందని తెలిపారు. ఆసుపత్రి మొత్తం సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామని అన్నారు.
2019లో టీడీపీ ప్రభుత్వం హయాంలోనే వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసామని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. ఆసుపత్రిలో ఎవరెవరు డాక్టర్ లు వున్నారో వారి పేరుతో బోర్డులు ఏర్పాటు చేయాలని, వార్డు పేరు, సిబ్బంది వున్నారో, లేదో తెలిపే సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు. రోగులకు ఇబ్బంది లేకుండా వార్డులపై సంబంధించిన ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆసుపత్రిలో ఎటువంటి అసౌకర్యాలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. పనులన్నీ మూడు నెలల్లోగా పూర్తి చేసి, ఆసుపత్రిని అందుబాటులోకి వచ్చేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి కాంపౌండ్ మొత్తం ఎత్తుపల్లాలు లేకుండా రహదారి నిర్మాణం చేపట్టాని, రోగులకు, స్ట్రెచ్చర్ కు ఇబ్బందులు కలగకూడదని తెలిపారు. మంచి నీటి ట్యాంకర్ మంజూరు చేయడం జరిగిందని, గర్భిణీలకు, బాలింతల కొరకు వేడి నీటి సౌకర్యం ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ఆసుపత్రిలో ప్రతీ గదిలోని లైట్లు, ఫ్యాన్లు కచ్చితంగా ఉండాలని, పాడైపోయిన స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రికి ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసి, నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆసుపత్రి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలని, డాక్టర్లు ఆసుపత్రిలో ఉండే సమయం, వెళ్లే సమయం రోగులకు తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రోగులకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి సీనియర్ సిబ్బందిలో ఒకరిని రిసెప్షన్ గా ఉంచాలని ఆమె తెలిపారు. ఆసుపత్రిలో ఉండే మందుల పేర్లను ప్రతీ గదిలో బోర్థులను ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ వైద్యం సాధ్యం కాని రోగులను మాత్రమే వేరే ఆసుపత్రులకు రిఫర్ చేయాలని, సాధ్యమైనంత వరకు ఇక్కడే వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. మందులను బయట కొనుక్కోమని ఎవరిని బలవంతపెట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ఒక గదిని ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ సందర్బంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్ పర్సన్ హోదాలో మహిళా శిశు సంక్షేమ శాఖామాత్యులు గుమ్మడి సంధ్యారాణి, వైకుంఠపు హర్షవర్ధన్, కారేపు చంద్రరావు, కాళ్ళ శ్రీను లను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులుగా నియమించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డియం, హెచ్ ఓ డా:కె.వి.ఎస్ పద్మావతి, సాలూరు ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా: ఎ.కె. రత్న కుమారి,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    • By RAHEEM
    • September 10, 2025
    • 8 views
    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 9 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ