సీడ్ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎంబిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసల రవి

మనన్యూస్:వెదురుకుప్పం వెనుకబడిన సంచారజాతులు అభివృద్ధి జరగాలంటే కేంద్రప్రభుత్వం సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన సీడ్ పథకం సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని శనివారం బి.సి సంక్షేమ మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖామాత్యులు యస్.సవితను తిరుపతి పద్మావతి అతిథి గృహం నందు ఎంబిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసల రవి మర్యాదపూర్వకంగా కలసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె సానుకూలంగా స్పందించి,సీడ్ సర్వే త్వరితగతిన పూర్తి చేయడానికి సంబంధిత అధికారులతో మాట్లాడి పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సంచారజాతుల అభివృద్ది కొరకు కేంద్రప్రభుత్వం సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన సీడ్ పథకం (స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డి-నోటిఫైడ్,నోమెడిక్ అండ్ సెమీ-నోమెడిక్ ట్రైబ్స్) ద్వారా బిసి-ఎ లోని అత్యంత వెనుకబడిన కులాల వారికి 4 విభాగాల్లో లబ్ది చేకూర్చడం జరుగుతుందని,ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఏపీ లోని అన్ని జిల్లాలకు ఉత్తర్వు జారీ చేసినారు.అన్ని జిల్లాలలోని యం.డీ.ఓ.లు ఈ సర్వే చేసి జిల్లా అధికారులకు అందజేయాలి. జిల్లా అధికారులు ఎ.పి.బి.సి.మంత్రిత్వ శాఖకు పంపిస్తే ఎ.పి ప్రభుత్వం సంచారజాతులు 32 కులాలకు నోమెడిక్, సెమీ- నోమెడిక్, డి-నోటిఫైడ్ ట్రైబ్స్ కులధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తారు.ఈ లిస్టును కేంద్రప్రభుత్వానికి పంపిస్తే,కేంద్రప్రభుత్వం లోని సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ యం.బి.సి.ల అభివృద్ధి కొరకు ప్రణాళిక చేసి నాలుగు విధాలుగా, ఇల్లు లేని వారికి ఇండ్లు, వ్యాపారము కొరకు ఋణాలు, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు పొందేందుకు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు కానీ అన్ని జిల్లాలలోను ఈ సర్వే నత్తనడకన సాగుతుందని, కొన్ని జిల్లాలలో ఇంకా ప్రారంభం కానే లేదని చాలా మంది అధికారులకు ఈ కులాల పైన అవగాహన లేదని మంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ సంచార జాతుల సంఘం మరియు దాసరి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పూసల రవి,టీడీపీ బీసీ దాసరి సాధికార సమితి జిల్లా అధ్యక్షులు మరియు ఏపీడీఆర్పీఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోలా జయచంద్ర పాల్గొన్నారు

  • Related Posts

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    • By RAHEEM
    • December 9, 2025
    • 6 views
    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు