సాలూరులో వంద పడకల ఆసుపత్రి నా కల, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మనన్యూస్:సాలూరు పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు నా కల అని,పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ,గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.శనివారం సాలూరు పట్టణంలో శరవేగంతో జరుగుతున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణన్ని మంత్రి పరిశీలించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన  పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2019లో ఎమ్మెల్సీగా,టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంజూరు చేసిందన్నారు.2019లో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు.గిరిజన,పేద ప్రజల చిరకాల కల వంద పడకల ఆసుపత్రి నిర్మాణమని తెలిపారు.ఎక్కువ పంచాయితీలు ఉన్న సాలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ ప్రాంతంలో ఆపద వస్తే  సాలూరులో ముప్పై పడకల ఆసుపత్రి మాత్రమే ఉందని,అత్యవసర పరిస్థితులలో విజయనగరం, విశాఖపట్నం పెద్ద ఆసుపత్రులకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు.మార్గమధ్యలో  పెషేంట్లు మరణించారనే వార్త తెలిసినప్పుడు చాలా బాధగా ఉంటోందని ఆవేదన  వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు.ముఖ్య మంత్రి స్పందిస్తూ తక్షణమే నాలుగు కోట్ల రూపాయల నిధులు ఆసుపత్రి నిర్మాణానికి మంజూరు చేయడం జరిగిందన్నారు. వంద పడకల ఆసుపత్రి పనులను శరవేగంతో పునఃప్రారంభించడం జరిగిందని వివరించారు. రాబోయే మూడు నెలల్లో వంద పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేసి సాలూరు ప్రజలకు అంకితమిస్తామని మంత్రి తెలిపారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ముఖ్యమంత్రి పేద ప్రజలకు నాణ్యమైన విద్యా, వైద్యం సకాలంలో అందాలని నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి సమైక్యంగా ఆసుపత్రి నిర్మాణంలో పాలుపంచుకోవాలని మంత్రి కోరారు.నిండు ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.గర్భిణీ స్త్రీల కోసం బర్త్  వెయిటింగ్ హాల్ ను ఏర్పాటు చేసి,డెలివరీ అయ్యే వరకు ఆసుపత్రిలోనే ఉంచి,పౌష్టిక ఆహారం అందించి డెలివరీ అయిన తరువాత అంబులెన్సులో ఇంటికి పంపించడం జరుగుతుందని తెలిపారు.పేదలకు వైద్యంపై భరోసా కల్పించాలని సూచించారు.అతి త్వరలోనే నాణ్యమైన,పూర్తి స్థాయిలో వైద్యానికి అవసరమైన పరికరాలతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని,ఆసుపత్రికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా సోలార్ పేనల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు
అంతకముందు ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.రూ.10.80 లక్షలతో నిర్మించిన గర్భిణీ స్త్రీల బర్త్  వెయిటింగ్ హాల్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పార్వతీపురం డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ డా.కె.వి.ఎస్ పద్మావతి,సాలూరు ప్రాంతీయ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    మన ద్యాస ప్రతినిధి, సాలూరు : – మండలంలోని మామిడి పల్లి శ్రీ సరస్వతీ శిశు మందిర్లో కమిటీ సభ్యులు, ఆచార్యులు నిర్వహించిన సప్త శక్తి సంగం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వక్తల సందేశాన్ని…

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    మన ధ్యాస ప్రతినిధి , సాలూరు డిసెంబర్ 7:- స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం. స్నేహం కంటే గొప్పబంధం మరేది లేదని 1987 సంవత్సరం పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవతరగతి బ్యాచ్ రుజువు చేసింది. ప్రతీ సంవత్సరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం