- విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్,….
- విశాఖ జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్,IAS…..
- జనసేన పార్టీ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు
- డిప్యూటీ మేయర్ పందిరి వెంకట శివప్రసాద్ కి మరియు జీవీఎంసీ కార్పొరేటర్ల కు ఎమ్మెల్యే పంచకర్ల అభినందనలు
- గ్రేటర్ విశాఖ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించండి….
- విశాఖ ఎంపీ భరత్,ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు,ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్…

విశాఖ మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 24:గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు జీవీఎంసీ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించాలని జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్,విష్ణు కుమార్ రాజు సూచించారు.జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశం మందిరంలో ప్రమాణ స్వీకారం చేసిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పందిరి వెంకట శివ ప్రసాద్ తో సహా 120 మంది కార్పొరేటర్లు కు ప్రమాణస్వీకారం శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యేలు..ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కార్పొరేటర్లుగా గెలిచిన అందరూ ఈ పదవులను బాధ్యతగా స్వీకరించాలే తప్ప, అహంకార ధోరణి ప్రదర్శించ రాదని ఉద్బోధించారు. ప్రజలు ఇచ్చిన పదవులను దుర్వినియోగం చేయకుండా ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. విశాఖ మహానగరం గణనీయంగా అభివృద్ధి చెందుతున్నందున అందులో మీరు కూడా భాగస్వాములు కావడం గర్వకారణంగా భావించాలన్నారు.గత జివిఎంసి పాలకులు నగరాన్ని బాగా అభివృద్ధి చేశారని, ఆ తర్వాత ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు, ఎంపీ తమ వంతు అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కార్పొరేటర్లు అందరూ ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలను గుర్తించి పని చేస్తే ఎంతోకాలం అధికారంలో కొనసాగుతారని ఎమ్మెల్యేలు సూచించారు.