- మక్తల్ అభివృద్ధికి విద్యే పునాది,త్వరలో పీజీ కళాశాల కూడా తీసుకొస్తా.
- మాటలు కాదు, చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తున్నాం.
- మక్తల్‌ను స్టడీ హబ్‌గా, స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తా.
మన ధ్యాస,మక్తల్: ఇరిగేషన్ కార్యాలయం వద్ద 9 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర క్రీడా, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,మక్తల్‌ను విద్యా, క్రీడా రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.సాధారణంగా డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం 6 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయిస్తుందని, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ప్రత్యేక చొరవ తీసుకొని మక్తల్ డిగ్రీ కళాశాల కోసం 9 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చానని తెలిపారు. గతంలో డిగ్రీ కళాశాల లేక ఎంతోమంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేసిన పరిస్థితి ఉండేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.ఇన్నేళ్లుగా మక్తల్‌కు డిగ్రీ కళాశాల ఎందుకు రాలేదో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచించాలని ఆయన అన్నారు. గతంలో సరిపడా విద్యార్థులు లేరనే కారణంతో కళాశాలను రద్దు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం మక్తల్‌లో 540 మంది విద్యార్థులు డిగ్రీ చదువుతుండటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.గతంలో మాదిరిగా కాకుండా భూమిపూజ చేసిన రోజే పనులు ప్రారంభించే అలవాటు తనదని, వచ్చే ఏడాది కార్తీక మాసంలో నూతన డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా త్వరలోనే మక్తల్‌కు పీజీ కళాశాలను కూడా తీసుకొస్తానని మంత్రి ప్రకటించారు. మక్తల్‌లో మినీ రవీంద్రభారతి ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.ఈ ప్రాంతంలో పుట్టి, ఇదే ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నరు.నియోజకవర్గంలో సుమారు 2 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. అయితే ఇన్నేళ్లపాటు ఈ ప్రాంతం వెనుకబడి ఉండటం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలకు సేవ చేయడం తన బాధ్యతని అన్నారు.ఇప్పటికే వెటర్నరీ రీసెర్చ్ సెంటర్‌ను తీసుకొచ్చామని, మక్తల్‌కు న్యాయవాదులు వచ్చి కోర్టులో విధులు నిర్వహించే స్థాయిలో న్యాయవ్యవస్థకు ప్రాధాన్యత పెరిగిందని ఆయన తెలిపారు. వచ్చే నెలలో 150 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకోబోతున్నామని, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు.ప్రభుత్వ పనులకు అవసరమైన ఇసుకను స్థానికంగానే వినియోగిస్తున్నామని, గతంలో మాదిరిగా మక్తల్ ప్రాంత ఇసుకను హైదరాబాద్‌కు తరలించడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వ అభివృద్ధి పనులకే ఇసుకను వినియోగిస్తున్నామని చెప్పారు.మక్తల్‌లో అధునాతన సౌకర్యాలతో స్టేడియం నిర్మించాలన్నది తన సంకల్పమని, అయితే కొందరు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. మక్తల్‌ను ఒక స్టడీ హబ్‌గా, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతానని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.పదవులు శాశ్వతం కాదని, మనం చేసిన అభివృద్ధి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ,, ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నదన్న కలెక్టర్.రూ. 9 కోట్లతో డిగ్రీ కాలేజీ భూమి కార్యక్రమం లో పాల్గొన్నందుకు 1 ఇయర్ లో కాలేజీ ని పూర్తి చేసుకోవాలి అని కోరుతూ నా సహాయ సహకారులు ఎప్పటికి అందిస్తా అని కలెక్టర్ తెలిపినారు.ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక, మక్తల్ మున్సిపల్ చైర్మన్ వాకిటి మానస హన్మంతు, కౌన్సిలర్ అల్కూరి పావని, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
