

మన న్యూస్:ఏలేశ్వరం ఒరిస్సా ప్రాంతం నుండి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన కే ఏ 51ఎంహెచ్187 నెంబర్ గల స్కోడా కార్ లో 10.280 కేజీలు గంజాయిని అక్రమంగా.తరలిస్తుండగా ఏలేశ్వరం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు కారులో తలుస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరు పరిచినట్లు పెద్దాపురం డిఎస్పి శ్రీహరి రాజు తెలిపారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.పట్టుపడ్డ గంజాయి బెంగళూరు విద్యాధరపురం లో వరదరాజ నగరం లో నయాజ్ పాషా అనే వ్యక్తి ఒరిస్సా నుండి బెంగళూరుకు తన భార్యతో 16 జాతీయ రహదారిపై వెళ్తూ ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామం సి పి ఎఫ్ ఫ్యాక్టరీ కి ఎదురుగా కారును ఆపి తన భార్యని కొడుతుండగా చూసిన స్థానిక ప్రజలు ఏలేశ్వరం పోలీసు కి సమాచారం అందించడంతో వెంటనే పెద్దాపురం డిఎస్పి డి శ్రీహరి రాజు ఆదేశాల మేరకు ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు నేపథ్యంలో ఎస్సై రామలింగేశ్వర రావు తన సిబ్బందితో హుటా హుటిన ప్రాంతానికి చేరుకుని పరిశీలించగా నయాజ్ పాషా అనుమానస్థితిలో ఉండగా కారును తనిఖీ నిర్వహించగా ఆ కారులో 10.280 కేజీల గంజాయి గుర్తించినట్టు తెలిపారు నాయజ్ పాషా వద్ద 65 వేల రూపాయలు మొబైల్ ఫోన్ న్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ముద్దాయికి గంజాయిని సరఫరా చేసిన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సమంత కంహార్ ని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు గొడవ లో తీవ్రంగా గాయపడిన అతని భార్యని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు ముద్దాయిని అరెస్టు చేసి కోర్టు లో హాజరు పరిచినట్లు డీఎస్పీ వెల్లడించారు. డిఎస్పి శ్రీహరి రాజు మాట్లాడుతూ యువత గంజాయి కి బానిసై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గంజాయి తాగుతూ గంజాయి అమ్ముతున్న యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఇకనైనా గంజాయి కి దూరంగా ఉండాలని లేకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. గంజాయిని పట్టుకున్న కృషి చేసిన సిఐ బి సూర్య అప్పారావుని,ఏలేశ్వరం పోలీస్ ఎస్ఐ రామలింగేశ్వరరావుని, సిబ్బందిని ఈ సందర్భంగా డిఎస్పి శ్రీహరి రాజు అభినందించారు