

మనన్యూస్:ప్రత్తిపాడు మండలం చిన్న శంకర్లపూడి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు.గ్రామ సర్పంచ్ ఏపూరి రామారావు,శ్రీమతి నాగమణి దంపతుల చేతుల మీదగా జరిగిన కార్యక్రమానికి నియోజకవర్గ వైకాపా నేత,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీ కృష్ణంరాజు హాజరయ్యారు.ముదునూరి శంకుస్థాపనలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ముదునూరి మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గ్రామంలో నిర్మించడం అభినందనీయమని, ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని,ఆ స్వామి దయతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఐశ్వర్యములతో వర్ధిల్లాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు,పిడుగు సత్యనారాయణ,కోలా తాతబాబు, బొల్లు నాగేశ్వరరావు,యాళ్ల యేసు,మాగాపు శివ, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.